ఏపీలో సినిమా టికెట్ ధరల అంశానికి తెరపడింది. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేసింది. టికెట్ ధరలను పెంచి చిత్రసీమలో ఆనందం నింపింది. టికెట్ ధరలు పెంచడం తో పాటు ఐదో షో కు అనుమతి ఇవ్వడం..ఆ ఐదో షో లో చిన్న సినిమాలకు అవకాశం ఇవ్వాలని తెలుపడం తో చిన్న నిర్మాతలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ వస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలుపగా..తాజాగా నిర్మాత దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తరపున మొదటగా టికెట్ ధరలు సవరించి కొత్త జీవో రిలీజ్ చేసినందుకు గాను ఏపీ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేసారు. ఇక అలాగే తెలంగాణలో అయితే ఐదు షోలకు గాను పలు పెద్ద సినిమాలకి అనుమతులు ఇవ్వడం చాలా మంచి అంశం అని తెలుగు సినీ పరిశ్రమ కోసం ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతగానో ఉపయోగకరం అని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.