కిరణ్ కాంగ్రెస్ విధేయుడే : దిగ్విజయ్

cm kiran digvijay singముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మరోసారి భరోసా వ్యక్తం చేశారు.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. కిరణ్ కాంగ్రెస్ విధేయుడేనని.. కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉంటారని డిగ్గీ రాజా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో దిగ్విజయ్ ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ..విభజన విషయంలో తలెత్తే అన్ని అంశాలను జీవోఎం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. అయితే, ఆంటోని కమిటీ నివేదికను ఇవ్వకపోవడాన్ని ఆయన సమర్థించారు. ఆంటోని కమిటీని కాంగ్రెస్ అధ్యక్షురాలు నియమించిందని.. అందువల్ల ఆ కమిటీ నివేదిక సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొనడం విశేషం. కాగా, వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విభజన బిల్లు వస్తోందని ఆశిస్తున్నట్లు దిగ్విజయ్ తెలిపారు.

దిగ్విజయ్ గతంలో కూడా ముఖ్యమంత్రి కిరణ్ కాంగ్రెస్ విధేయుడేనని వ్యాఖ్యానించి భంగపడ్డాడు కూడా. ఎందుకంటే.. ఇటు దిగ్విజయ్ ఇలా కిరణ్ కాంగ్రెస్ విధేయుడేనని వ్యాఖ్యానించాడో లేదో.. వెంటనే కిరణ్ కఠినంగా ఖండించారు. అది దిగ్విజయ్ స్వొంత అభిప్రాయం కావొచ్చని.. సమైక్యాంధ్ర స్టాండ్ ను వదిలేది లేదని తేల్చిచెప్పేశారు. దీంతో.. కొంతకాలంగా ముఖ్యమంత్రిపైనా, ఏపీ రాజకీయాలపైనే కామెంట్లు చేయడం మానేశారు డిగ్గీరాజా. అయితే, విభజన అంశం తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో.. నా వాయిస్ కూడా వినిపించాలని భావించాడేమో ఢిగ్గీరాజా .. వెంటనే ప్రెస్ ముందుకు వచ్చి పాత కామెంట్లనే.. కొత్తగా చెప్పేశాడు. మరీ.. ఢిగ్గీరాజా తనపై చేసిన భరోసా వ్యాఖ్యలపై కిరణ్ ఏలా స్పందిస్తారో మరీ.. !