Site icon TeluguMirchi.com

‘మోడీ.. మనకో నకిలీ ఒబామా’..!

digvijay-singhహైదరాబాద్ సభలో నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. మోడీ రూపంలో ఇప్పుడు మనకో ‘నకిలీ ఒబామా’ ఉన్నాడు’ అంటూ ట్వీట్ చేశారు ఢిగ్గీ రాజా. ఆదివారం ఎల్బీనగర్ లో జరిగిన ‘నవభారత యువభేరి’ సభలో మోడీ.. ఒబామా కొటేషన్లను వినియోగించారు. ఈ క్రమంలో ‘ఎస్ వుయ్ కెన్.. ఎస్ వుయ్ విల్ డూ (మనం చేయగలం.. అవును మనం చేద్దాం)’ అంటూ ప్రజల చేత అనిపించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి పారదోలాలని పిలుపునిచ్చారు. కాగా, బీజేపీ నేతలు మాత్రం ఆ కొటేషన్లు.. స్వామి వివేకానంద చేసినవే ఒబమా ఉపయోగించుకున్నారు. భారతీయుల వ్యాఖ్యలను ఒబామా వినియోగించారు…మోడీ కాదని ఢిగ్గీరాజాపై మండిపడుతున్నారు.

Exit mobile version