తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ను గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధరణి పోర్టర్ అధికారికంగా ప్రారంభించారు.
రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిందన్నారు. ఇకపై అన్ని రకాల రిజిస్ట్రేషన్లు అన్‌లైన్‌లోనే జరగనున్నాయి. పావుగంటలోనే రిజిస్ట్రేసన్ మ్యాటేషన్ జరుగుతుందన్నారు. పోర్టల్‌లో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు వస్తాయన్నారు సీఎం. ప్రతీ ఇంచు భూమిని డిజిటిలైజేషన్ చేస్తామన్నారు.