దేవినేని ఉమ అరెస్ట్ !

devineniకేంద్ర కేబినేట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సీమాంధ్ర జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే, ఆందోళన చేస్తున్న పలువురు ఆందోళకారులను పోలీసులు అదుపులోనికి తీసుకుంటున్నట్లు సమాచారం. తాజాగా, కేబినేట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఆందోళనకు దిగిన తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమతో పాటుగా ధర్మాలో పాల్గొన్న పలువురు తెదేపా కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కేబినేట్ నిర్ణయానికి వ్యతిరేకంగా.. సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. కేబినేట్ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.