లిక్కర్ స్కాం పై 58 పేజీల రిమాండ్‌ రిపోర్టు.. రిపోర్ట్ లో ఏముంది?


మనీశ్‌ సిసోదియాను ఇవాళ కోర్టులో హాజరు పరిచిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆయనతో పాటు రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. 58 పేజీల రిమాండ్‌ రిపోర్టులో ఇప్పటి వరకు వెలుగులోకి రాని రాజకీయ, ఆర్థిక, నేరపూరిత వ్యవహారాలను ఈడీ బయటపెట్టింది. లిక్కర్‌ స్కామ్‌ హైదరాబాద్‌ కేంద్రంగానే జరిగిందని ఈడీ పేర్కొంది. దినేష్ అరోరాను హైదరాబాద్‌కు పిలిపించిన సౌత్‌ గ్రూప్‌ హైదరాబాద్‌లోనే కీలక చర్చలు, ఒప్పందాలు చేసుకుందని వెల్లడించింది. MLC కవితకు, దిల్లీ CM, డిప్యూటీ CMతో ఈ విషయంలో అవగాహన ఉందని బుచ్చిబాబు చెప్పారని ఈడీ తెలిపింది. కాగా రేపు ఉదయం 10 గంటలకు ఈడీ విచారణకు MLC కవిత హాజరు కానుంది.