Site icon TeluguMirchi.com

రచ్చబండలో సీఎం ఫ్లెక్సీ తొలగింపు

రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ వాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా, కరీంనగర్ జిల్లా జగిత్యాల రచ్చబండ కార్యక్రమంలో… ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను సైతం తొలగించారు. రచ్చబండ మొదలు కాకముందే.. జిల్లా సర్పంచుల సంఘం నేతలు వేదికపైకి వచ్చి సీఎం ఫ్లెక్సీలను చిచ్చేశారు. సమైక్య ముఖ్యమంత్రి ఫొటో
తెలంగాణలో ఉండరాదని నినాదాలు చేశారు. అయితే, సర్పంచులు ముఖ్యమంత్రి ఫొటోను తొలగిస్తున్న సమయంలో.. అక్కడ వున్న ఏ కాంగ్రెస్ నేత కూడా వ్యతిరేకించికపోవడం విశేషం. ఇప్పటికే, తెలంగాణ నేతలు ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రతి గ్రామంలోను కిరణ్ కు ఇదే తరహా నిరసనలు ఎదురైతే.. ముఖ్యమంత్రిగా కొనసాగడం కష్ట సాధ్యమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఆది నుంచి విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి నిన్న జీవోఎంతో జరిగిన భేటీలోమరోసారి సమైక్యవాదాన్ని బలంగా వినిపించిన విషయం తెలిసిందే.

Exit mobile version