తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కొయంబత్తూర్, సూలురు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో విమానంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ఆర్మీ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదాన్ని భారత వాయుసేన కూడా ధ్రువీకరించింది. జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీఎఫ్ హెలికాప్టర్ కూనూరు సమీపంలో కూలిపోయినట్లు ఐఏఎఫ్ అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది.
హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న వారి లిస్ట్