Site icon TeluguMirchi.com

నివేదికలు ఇచ్చాకే.. నిర్ణయమట..!

Digvijay_Singhతెలంగాణ అంశాన్ని ఎప్పటికప్పుడు వేడి వేడిగా వుంచడంలో డిగ్గీ రాజాకు సాటేలేరు. త్వరలో తెలంగాణపై తేల్చేస్తామని.. తేలిగ్గా చెప్పిన దిగ్విజయ్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో మాత్రం రెండొందల శాతం సఫలీకృతం అయ్యారనే చెప్పాలి. రాష్ట్రాన్ని విభజించడం బాధాకరం అంటాడోసారి, రాష్ట్రాన్ని విభజిస్తేనే కాంగ్రెస్ కు లాభమంటాడు మరోసారి. మొత్తమ్మీద మొదటిసారి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడిగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన డిగ్గీ రాజా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేతిలో ఓ నివేదిక మాత్రం పెట్టేశాడు. పోతుపోతూ.. ముఖ్యనేతలందరూ.. రోడ్ మ్యాప్ తో రావాలని ఆదేశించి మరీ వెళ్లాడు. దీంతో.. రాష్ట్రంలో ఇటు ప్రత్యేక తెలంగాణ, అటు సమైక్యాంధ్రా కు సంబంధించిన సభలు వాడివేడిగా సాగుతున్నాయి. నేతలు సభాసమావేశాల్లో మునిగిన వేళ.. డిగ్గీ రాజా కూల్ గా కామెంట్లు చేస్తున్నాడు. తాజాగా, తెలంగాణపై స్పష్టమైన గడువును ఇవ్వలేమని.. నేతల నివేదికలు వచ్చాకే నిర్ణయమని నేరుగా చెప్పేశాడు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ నివేదికలు ఇచ్చాకే తెలంగాణపై కోర్ కమిటీ సమావేశం ఉంటుందని దిగ్విజయ్ పేర్కొన్నారు. నివేదికలు వచ్చాక.. నిర్ణయమన్న డిగ్గీరాజా ఈ లోపు నేతల నివేదనలు వింటూ కూల్ గా పని కానిచ్చేస్తున్నారన్న మాట !

Exit mobile version