Site icon TeluguMirchi.com

పెను ప్రమాదం నుండి బయటపడ్డ గవర్నర్ దత్తాత్రేయ

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. చౌటుప్పల్‌ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. సూర్యాపేటలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.

ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయతోపాటు డ్రైవర్‌, ఆయన వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. ముగ్గురు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత మరో వాహనంలో గవర్నర్ దత్తాత్రేయ అక్కడ్నుంచి బయల్దేరి వెళ్లిపోయారు.

Exit mobile version