Site icon TeluguMirchi.com

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యునిగా దాసరి కిరణ్ కుమార్ ప్ర‌మాణస్వీకారం


టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యునిగా శ్రీ దాసరి కిరణ్ కుమార్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ దాసరి కిరణ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ ప్ర‌సాదాలు, చిత్ర‌ప‌టాన్ని అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో బోర్డు సెల్ డెప్యూటీ ఈఓ శ్రీమతి క‌స్తూరి బాయి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి, పారుపత్తేదార్ శ్రీ తులసీప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version