Site icon TeluguMirchi.com

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం, డీఏపీ ఎరువు బస్తాపై భారీగా సబ్సిడీ

రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. డీఏపీ ఎరువుపై ప్రస్తుతం బస్తాకు ఇస్తున్న రూ.500 రాయితీని రూ.1,200కి పెంచింది. తద్వారా ఈ ఎరువుపై రైతుకు అదనంగా 140%మేర రాయితీ ప్రయోజనం లభించనుంది.

బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఎంవో తెలిపింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ రైతులకు పాత ధరలకే ఎరువులు లభించేలా చూడాలన్న ఉద్దేశంతో సబ్సిడీని పెంచినట్లు పేర్కొంది. గతంలో ఎన్నడూ ఇంత భారీస్థాయిలో ఒకేసారి రాయితీని పెంచిన దాఖలా లేదంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బస్తా డీఏపీ ఎరువు రూ.1,200 ధరకే రైతుకు లభించనుంది.

Exit mobile version