Site icon TeluguMirchi.com

హోం మంత్రిగా దామోదర ?

damodharaకీలకమైన హోం శాఖ కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హస్తినాలో రాజనర్సింహ ఆ దిశగా ప్రయత్నాలలో బిజీగా ఉన్నారు. సీబీఐ ఛార్జిషీటులో ఏ4 నిందితురాలిగా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండటంతో.. ఆమె పై వేటు ఖాయమని రాజకీయవర్గాల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటినుంచే డిప్యూటీ సీఎం ఆ పదవిని చేజిక్కించుకునేందుకు హస్తినలో తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలకే హోం మంత్రి పదవి కట్టబెట్టాలని అధిష్టానం భావించిన నేపథ్యంలో.. మరో మంత్రి శ్రీధర్ బాబు దామోదరకి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి డిప్యూటి సీఎం ‘హోం’ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి !

Exit mobile version