18న జరగబోయే దళిత, గిరిజన దండోరా స్థలం మార్పు

ఈ నెల18వ ఇబ్రహీంపట్నం లో నిర్వహించ తలపెట్టిన దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా నిర్వహణకు ముందు అనుకున్న స్థలానికి పోలీసుల అనుమతి ఇవ్వకపోవడంతో స్థలాన్ని మార్చినట్టు మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు.

పోలీస్ ల సూచన మేరకు ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా ఉండేందుకు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ దండోరా సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. దండోరా సభ 18వ తేదీన జరుగుతుందని ఆయన వివరించారు..