ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దళితబంధు పథకంలో భాగంగా నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పొరేషన్ నిధులను విడుదల చేసింది. నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలంలో దళితబంధును పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు రూ. 50 కోట్లు, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి రూ.100 కోట్లు విడుదల. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండ మండలానికి రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి రూ.50 కోట్లను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో తెలంగాణ షెడ్యూల్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవాళ జమ చేసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.