వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం లో జరిగిన చంద్రబాబు పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు.
తెలుగుదేశం పార్టీలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కీలకమైన నాయకుడిగా ఉంటూ, అనేక పదవులను అనుభవించిన వీరభద్రరావు కేవలం పదవి రాలేదన్న బాధతోనే ఇంతటి తీవ్ర నిర్ణయం గైకోనటంపట్ల తెలుగుదేశం నాయకులే కాక ఇతర పార్టీల నాయకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం జగన్ పార్టీలో చేరేందుకే ఈ వంకతో దేశం నుంచి నిష్క్రమించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ రోజుతో( మే 2 వ తేది ) ఆయన శాసన మండలి సభ్యత్వ గడువు పూర్తవటంతో పూర్తి కాలం పదవిని అనుభవించి ఆయన పార్టి కి రాజీనామా చేయటం ఆయన వ్యక్తిత్వాన్ని, నైజాన్ని స్పష్టం చేస్తోందని దేశం నాయకుడొకరు వ్యాఖ్యానించారు. దాడి చర్య తల్లి పాలు తాగి రొమ్ము గుద్దటమేనని ఆయన విమర్శించారు.