బీసీ కార్డుని నమ్ముకొని ముందుకు పోతున్న డీ. శ్రీనివాస్

D.-srinivasతెలంగాణ వస్తుందా రాదా అనుకొనే రోజుల్లో కూడా కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని ఒక్క మాట కూడా అనని తెలంగాణ రాజకీయ నాయకుడు ఎవరన్నా వున్నారా అంటే, అది.. డీ శ్రీనివాస్ ఒక్కరే! దానికి కారణం కాంగ్రెస్ రాజకీయాలు బాగా తెలిసి వుండడమే. గాంధీ కుటుంబానికి విధేయులుగా వుంటేనే పైకి కాంగ్రెస్ లో పైకి రాగలము అనే నిష్టూర సత్యాన్ని బాగా ఒంటబట్టించుకొన్నాడు కనుకనే ఎప్పుడు కూడా అధినేత్రిని పల్లెత్తు మాట అనలేదు.

కాంగ్రెస్ రాజకీయాల్లో బాగా ఆరితేరి పోయిన శ్రీనివాస్ కి కాంగ్రెస్ అధిష్టాన వర్గం గురించి, కేంద్ర ప్రభుత్వ శక్తి గురించి బాగా తెలుసు. అదే విధంగా తన శక్తియుక్తులు లిమిటేషన్స్ కూడా బాగా తెలిసిన వ్యక్తి. అందుకే రెండు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో వరుసగా ఓడిపోయినా అధిష్టాన వర్గ ప్రాపకం తో ఎం ఎల్ సి సంపాదించుకొన్నారు.

వెలమ, రెడ్డి ముస్లిం, మాదిగ వర్గాలు బాగా ప్రాధాన్యం వహించే తెలంగాణ లో బీ సీ వర్గానికి చెందిన తాను ఎప్పటికన్నా చక్రం తిప్పగలనని అనుకొన్నారేమో.., కే. కేశవరావు లాగా అధిష్టానం ని తన మాటలతో విసిగించలేదు. పక్క పార్టీకి వెళ్లిపోతానని బెదిరించలేదు. పార్టీకి చికాకులు సృష్టించలేదు. తన లోప్రొఫైల్ మెయింటైన్ చేసుకొంటూ అవసరం వచ్చినప్పుడు మాట్లాడుతూ, తెలంగాణ వాడిగానే వుంటూ బానే నెట్టుకొచ్చాడు. పెద్దగా శత్రువులు లేకుండా, వున్న స్నేహితులని కాపాడుకొంటూ కాలం గడిపాడు.

ఇప్పుడు బీ సీ ఛాంపియన్ గా ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు. మొన్ననే నిజామాబాద్ లో బీ సీ సర్పంచ్ ల మహాసభ పెట్టి తానే బీ సీ వర్గానికి నాయకుడినని చెప్పుకొనేందుకు ప్రయత్నించాడు. చాలా కాలం నించీ రాజకీయాల్లో వుండబట్టి, అదీ కాకుండా పీ సీ సీ అధ్యక్ష పదవి చేపట్టబట్టి రాష్ట్రంలో పెద్ద నాయకునిగా వచ్చిన పేరుని రెండు సార్లు అవమానకర రీతిలో ఓడిపోయినా నిశబ్ధంగా వుందడి తన ఉనికిని కాపాడుకొన్నాడు.

ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేసులోకి వచ్చాడు. రెడ్డి, దళితలు కాకుండా బీసీ లకే ఇవ్వాలని వాదన కూడా ఇప్పటికే లేవదీశాడు. ఇప్పుడు అధిష్టానానికి కావాల్సింది కూడా శ్రీనివాస్ లాంటి వాళ్ళే. తమ మాటకు కట్టుబడి వుండే వాళ్ళంటే కాంగ్రెస్ హై కమాండ్ ఎప్పుడూ బాగానే చూసుకొంటుంది అన్న సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించే శ్రీనివాస్ కి రాగల కాలం మంచిదే అని చెప్పచ్చు. ప్రభుత్వాన్ని నడిపే పనితనమేమోగానీ, వ్యక్తులను నియంత్రించే రాజాకీయం మాత్రం శ్రీనివాస్ దగ్గర పుష్కలం గా వుంది. మరి కాంగ్రెస్ అధిష్టానానికి కూడా కావాల్సింది అదేగా మరి??!!