’తెలంగాణ’ను అగ్రగామిగా నిలుపుదాం : డీఎస్

d srinivasప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతా పూర్వకంగా టీ.కాంగ్రెస్ నేతలు తెలంగాణలోని జిల్లాల వారీగా భారీ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో కాంగ్రెస్ కృతజ్ఞత జరుగుతోంది. ఈ సభకు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ డీఎస్, మంత్రులు డీకే అరుణ, సారయ్య, సుదర్శన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ.. విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుదామని, అందుకు కావాల్సిన సమర్థ నాయకత్వం మనకుందని తెలిపారు. విభజనపై సీడీబ్ల్యూసీలో పేర్కొన్న 11అంశాలపై జీఎంవో నివేదిక కోరిందని.. అయితే, ఎవరినీ సంప్రదించకుండా ముఖ్యమంత్రి నివేదికను జీవోఎంకు పంపడం శోచనీయమని పేర్కొన్నారు. ఎవరిన్నీ చేసినా.. త్వరలోనే ప్రత్యేక తెలంగాణ కల పరిపూర్ణమవుతుంది డీఎస్ అన్నారు.