Site icon TeluguMirchi.com

ఖరీఫ్‌ సీజన్‌ పంటల కనీస మద్దతు ధర పెంపు, పంటల వారీగా రేట్లు!

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పంటల కనీస మద్దతు ధరలను కేంద్రం ఖరారు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ కమిటీ సమావేశంలో నూతన కనీస మద్దతు ధరలకు ఆమోదం లభించింది. 2021-22 మార్కెట్‌ సీజన్‌కు ఈ ధరలు వర్తిస్తాయి.

వరి ధాన్యం క్వింటాకు రూ.72 మేర పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.1868 ఇస్తుండగా.. ఇకపై రూ.1940 చెల్లించనున్నారు. క్వింటా కంది, మినముల కనీస మద్దతు ధరను కూడా రూ.300 మేర పెంచింది. క్వింటా జొన్నలకు ప్రస్తుతం రూ.2,150 ఇస్తుండగా.. దాన్ని రూ.2,250కి పెంచారు. భవిష్యత్‌లోనూ కనీస మద్దతు ధరలు కొనసాగుతాయని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు.

Exit mobile version