ఇటు సంబరాలు, అటు సెగలు !

telangana5రాష్ట్రంలో ఒక ప్రాంతం ప్రశాంతంగా వుంటే.. మరో ప్రాంతం రావణ కాష్ట్రలా మారిపోవడం ఇటీవల కాలంలో కామన్ గా మారిపోయింది. తాజాగా, పదిజిల్లాల తెలంగాణకు కేంద్ర కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రాంతంలో సంబరాలు ఆకాశనంటితే, సీమాంధ్ర లో నిరసన జ్వాలలు చెలరేగాయి. ఇది ‘బ్లాక్ డే’ అని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఆక్రోశం వ్యక్తం చేశారు.

జీవోఎం రాయల తెలంగాణ ప్రతిపాదనకే మొగ్గు చూపుతుందన్న వార్తల నేపథ్యంలో.. నిన్న సాయంత్రం వరకు ఉద్యమ వేడితో రగిలిన తెలంగాణలో.. పది జిల్లాల తెలంగాణకే కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఒక్కసారిగా సంబరాల సన్నివేశం ఆవిష్కృతమైంది. ఇక అప్పటి వరకు ప్రశాంతంగా వున్న సీమాంధ్రలో మరోసారి ఉద్యమ సెగలు ఎగసి పడ్డాయి. సీమాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. సీమాంధ్రలో కాంగ్రెస్ ఖతం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సీమాంధ్రలోని 13జిల్లాల్లో ఉద్యమ సెగలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే 48గంటల సీమాంధ్ర బంద్ కు తెదేపా పిలుపునివ్వగా, వైకాపా  24గంటల బంద్ కు పిలుపునిచ్చింది. ఇక విభజన విషయంలో.. తమ మాటను అధి ఏమాత్రం ఖాతరు చేయలేదని అలకమీదున్ను కేంద్ర మంత్రులు తమ రాజీనామాలను నేరుగా రాష్ట్రపతికి అందజేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, తెలంగాణ ప్రాంతంలో అప్పుడే పూర్తి సంబరాలు వద్దని, పార్లమెంట్ లో టీ-బిల్లు ఆమోదం పొందిన తరవాతే సంబరాలు చేసుకుందామని టీ-జేఏసీ నేతలు నిర్ణయించారు.

ప్రస్తుతానికైతే.. తెలంగాణ ప్రాంతం ప్రశాంతంగా వుండగా, సీమాంధ్ర ఉద్యమ జ్వాలలతో ఎగసిపడుతుంది. టీ-బిల్ల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లో గానీ లేదా జనవరిలో ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశాల్లోగానీ ఆమోదం లభించినట్లయితే.. ఈ సీన్ కాస్త రివర్స్ అయ్యే అవకాశం వుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు తెలంగాణ రగిలిపోతుంటే.. సీమాంధ్ర ప్రశాంతంగా వుంటుందన్న మాట. మరీ.. ఈ ఉద్యమాలకు పులిస్టాఫ్ పడేదెప్పుడో..