Site icon TeluguMirchi.com

వాక్సిన్ వృధాపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం, ఈ రాష్ట్రాలలో ఎక్కువ వృధా!

ఈ ఉదయం 8గంటల నాటికి 22కోట్లకు(22,00,59,880) పైగా టీకా డోసులను రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 20,13,74,636 డోసులను(వృథాతో కలిపి) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వినియోగించుకోగా.. ఆయా 1.77కోట్ల డోసులు వాటి వద్ద మిగిలే ఉన్నట్లు తెలిపింది.

కొన్ని రాష్ట్రాల్లో మాత్రం టీకా వృథా విపరీతంగా ఉంటుండంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యాక్సిన్‌ వృథాను ఒక శాతం కంటే తక్కువే ఉంచాలని కేంద్రం పదేపదే కోరుతున్నా.. ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో దాదాపు మూడోవంతు డోసులు నిరుపయోగమవుతున్నాయని పేర్కొంది. అత్యధికంగా ఝార్ఖండ్‌లో 37.3శాతం టీకాలు వృథా అవగా.. ఛత్తీస్‌గఢ్‌లో ఇది 30.2శాతంగా ఉండటం గమనార్హం. ఆ తర్వాత తమిళనాడులో 15.5శాతం, జమ్మూకశ్మీర్‌లో 10.8శాతం, మధ్యప్రదేశ్‌లో 10.7శాతం టీకాలు వృథా అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్త సగటు(6.3శాతం)తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని, రాష్ట్రాలు దీనిపై మరింత దృష్టి పెట్టి వ్యాక్సిన్ల వృథాను నిలువరించాలని సూచించింది.

Exit mobile version