దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. కొంతమంది డాక్టర్లు కరోనా కు వైద్యంచేసి మంచి పేరు తెచుకుంటుంటే, మరికొన్ని కార్పొరేట్ ఆసుపత్రి లు ఇదే అదనుగా కరోనా పేషెంట్ ల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. కొన్ని హాస్పిటల్స్ పై కఠిన చర్యలు తీసుకున్న వీళ్ళు ఏ మాత్రం మారట్లేదు. తాజాగా తెలంగాణాలో 113 కార్పొరేట్ హాస్పిటళ్లపై ప్రభుత్వానికి పిర్యాదులు అందగా, ఆ 113 హాస్పిటళ్ళకు షో కాజ్ నోటీసులు పంపించారు. ఈ రోజు వరకు మొత్తం 22 కార్పొరేట్ హాస్పిటళ్లలో కోవిడ్ వైద్యానికి అనుమతి నిరాకరించారు.
ఈ రోజు కొత్తగా కిమ్స్ హాస్పిటల్ – సికింద్రాబాద్, సన్ షైన్ హాస్పిటల్ – గచ్చిబౌలి, సెంచరీ హాస్పిటల్స్ – బంజారా హిల్స్, లోటస్ హాస్పిటల్స్ – లక్డికాపూల్, మెడిసిస్ హాస్పిటల్ – ఎల్బి నగర్, ఇంటెగ్రో హాస్పిటల్ – టోలిచౌకి మెయిన్ రోడ్, రేతిబౌలి ల్లో కోవిడ్ వైద్యానికి అనుమతి నిరాకరిస్తూ ప్రకటన విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.