Site icon TeluguMirchi.com

గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ -19 ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు

కోవిడ్-19 కారణంగా ఉత్పన్న మౌతున్న ఆరోగ్య సమస్యల పరిష్కారం తో సహా వారి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తోంది.

కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడానికి చర్యలు కొనసాగుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా కోవిడ్-19 వ్యాప్తి చెందుతూ ఉండడంతో, ఈ క్రింది చర్యలు చేపట్టడం జరిగింది:

కరపత్రాలు, పోస్టర్లు, ఆడియో మరియు దృశ్య,శ్రవణ లఘు చిత్రాలు వంటి, సమాచార, ప్రచార సామాగ్రి, టూల్‌-కిట్లు అభివృద్ధి చేసి, స్థానిక భాషల్లోకి అనువదించడం కోసం, వాటిని రాష్ట్రాలకు అందించడం జరిగింది. మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యల గురించి, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా తో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా, స్థానిక సమాజానికి వివరించడం జరిగింది. మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక అధికారులు దూరదర్శన్ / టీవీ ఛానెళ్ల లో వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. కోవిడ్-19 పై సమాచారం కోసం అంకితమైన కాల్-సెంటర్ / హెల్ప్‌-లైన్ (1075) సమాజానికి ఎంతో సహాయం చేస్తోంది.

అదనంగా, కోవిడ్ సంబంధిత సందేశాలను స్వీకరించి, విస్తరించడానికి వీలుగా, అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, జల శక్తి మంత్రిత్వ శాఖ, స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వంటి అన్ని ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖల మద్దతు కూడా తీసుకోవడం జరుగుతుంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ ఈ రోజు ఇక్కడ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానం లో ఈ విషయాన్ని పొందుపరిచారు.

Exit mobile version