తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు రెండు వేలకు పైగా కేసులు నమోదు అవుతూ , పదుల సంఖ్యలో మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,278 కేసులు నమోదు కాగా.. వైరస్ తాకిడికి 10 మంది మృతి చెందారు.
దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,54,880కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,21,925 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 950కు చేరింది. ఇక జిల్లాల వారీగా కేసులు చూస్తే..ఈ కింది విధంగా ఉన్నాయి.