Site icon TeluguMirchi.com

కేంద్రం సంచలన నిర్ణయం : కోవాగ్జిన్ టీకా టెక్నాలజీ బదిలీ కి ఓకే !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అయ్యే కొవాక్సీన్, కోవిషిల్డ్ టీకాలను ప్రజలకి ఇస్తున్నారు, కానీ డిమాండ్ కి సరిపడా డోస్ లు ఉత్పత్తి కావడం కష్టంగా మారిన వేళ మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కోవాగ్జిన్ టెక్నాలజీ బదిలీకి కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో కరోనా టీకా ఉత్పత్తి వేగవంతం కానుంది. తాజా నిర్ణయంతో కొవిడ్ 19 వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఫార్ములాను మరికొన్ని కంపెనీలకు కేంద్రం ఇవ్వనుంది.

“ప్రస్తుతం సీరం, భారత్‌ బయోటెక్‌ లు కలిపి నెలకు 6-7 కోట్ల కరోనా టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి.. ఈ లెక్కన దేశంలోని ప్రజలందరికీ టీకాలు వేయాలంటే రెండేండ్లు పడుతుంది. దీన్ని అధిగమించాలంటే టీకా టెక్నాలజీ బదిలీ ఒక్కటే మార్గం. ఇదే విషయంపై కొన్నిరోజులుగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి లేఖలు రాసారు.

Exit mobile version