Site icon TeluguMirchi.com

గుజరాత్ లో భాజపా, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్

Gujarat-resultsగుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా పార్టీ గెలుపుదిశగా పయనిస్తోంది. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హ్యాట్రిక్ విజయానికి చేరువలో ఉన్నారు. భాజపా 113 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 63 స్థానాల్లో, జీపీపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుపు దిశగా పయనిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో భాజాపా, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ తదుపరి రౌండ్లలో కాంగ్రెస్ దూసుకుపోయింది. ఇప్పటివరకు 37 స్థానాల్లో కాంగ్రెస్, 24 భాజపా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Exit mobile version