తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలు రెడ్..ఆరెంజ్.. గ్రీన్ అంటే..

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. 41 రోజులుగా లాక్ డౌన్ ను పటిష్టం చేస్తున్నప్పటికీ కేసులు మాత్రం నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాల్లోని జిల్లాలను రెడ్, ఆరెంజ్ , గ్రీన్ జోన్లుగా విభజించింది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే..మొదట్లో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి భారీగా పెరిగాయి.ఆ తర్వాత ప్రభుత్వం ఎక్కడిక్కడే కట్టుదిట్టం చేయడం తో అదుపులోకి వచ్చింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం తో రాష్ట్ర ప్రజలు కాస్త సంతోషం గా ఉన్నారు.

ఇక జోన్ల విషయానికి వస్తే..హైద్రాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ అర్బన్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించిన కేంద్రం.. గద్వాల, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసీఫాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, జగిత్యాల, జనగాం, మెదక్, సిరిసిల్ల, భూపాలపల్లి, నారాయణపేట , మంచిర్యాల జిల్లాలను ఆరెంజ్ జోన్‌లుగా పేర్కొంది. ఇక, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్ , భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, సిద్దిపేట, భువనగిరి యాదాద్రి, వరంగల్ రూరల్ జిల్లాలను గ్రీన్‌ జోన్లుగా ప్రకటించింది.