Site icon TeluguMirchi.com

తెలంగాణ లో ప్రారంభమైన కరోనా టీకా డ్రైరన్‌

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు దేశ వ్యాప్తంగా కరోనా టీకా డ్రైరన్‌ ప్రారంభించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఏడు కేంద్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. హైదరాబాద్‌లోని గాంధీ దవాఖాన, నాంపల్లి ఏరియా దవాఖాన, తిలక్‌నగర్‌ యూపీహెలో, సోమాజిగూడ యశోద హాస్పిటల్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని జానంపేట పీహెచ్‌సీ, మహబూబ్‌నగర్‌ జీజీహెచ్‌, నేహా షైన్‌ హాస్పిటల్‌లో డ్రైరన్‌ కొనసాగుతున్నది. దేశ వ్యాప్తంగా కరోనా టీకా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తుంది.

దేశంలోని మొత్తం 116 జిల్లాల్లో 259 ప్రదేశాల్లో ఈ డ్రైరన్‌ను నిర్వహిస్తున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాటుచేసే వ్యవస్థల పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. కొవిన్‌ పోర్టల్‌ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు డ్రైరన్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి నిమిషం క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేస్తారు. అన్ని రాష్ట్రాల్లో కనీసం మూడు ప్రదేశాల్లో డ్రైరన్‌ కార్యక్రమం చేపట్టారు.

Exit mobile version