ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరులోని భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయానికి సతీమణి వైఎస్ భారతితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం వార్డు/గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అటు తర్వాత మూడు నెలల్లో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. 45 ఏళ్ళు నిండిన అందరికి వ్యాక్సిన్ వేయిస్తాం. వ్యాక్సినేషన్లో దేశానికీ ఆదర్శంగా నిలుస్తాం. కేంద్ర మార్గదర్శకాలు ప్రకారం టీకా పంపిణి జరుగుతుంది అని అన్నారు.