తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రం వ్యాప్తంగా లక్ష దాటాయి. గడిచిన 24 గంటల్లో 2,474 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,01,865కి చేరింది. తెలంగాణలో రోజూ ఐదు నుంచి 10 మంది దాకా చనిపోతున్నారు. నిన్న కరోనాతో 7గురు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 744కి చేరింది. మరణాల రేటు తెలంగాణలో 0.73 శాతం ఉండగా… దేశంలో అది 1.89 శాతంగా ఉంది.
గడిచిన 24 గంటల వ్యవధిలో 43,095 మందికి కొవిడ్ -19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 8,91,173 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 447, రంగారెడ్డి జిల్లాలో 201, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించింది. భద్రాద్రి కొత్తగూడెంలో 44, ఖమ్మంలో 125, వరంగల్ అర్బన్ జిల్లాలో 123, వరంగల్ గ్రామీణ జిల్లాలో 22 చొప్పున, ఆదిలాబాద్ జిల్లాలో 15, జగిత్యాల జిల్లాలో 91, జనగామా జిల్లాలో 20, జోగుళాంబా గద్వాల జిల్లాలో 59, నల్గొండ జిల్లాల్లో 122, కామారెడ్డి జిల్లాల్లో 61, సిద్దిపేట జిల్లాల్లో 92, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 52, పెద్దపల్లి జిల్లాల్లో 79, సూర్యాపేట జిల్లాల్లో 63, నిజమాబాద్ 153, మహబూబాబాద్ జిల్లాల్లో 59, మహబూబ్‌నగర్ జిల్లాలో 49, నారాయణపేట జిల్లాలో 11, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 11, మెదక్ జిల్లాలో 38, ములుగు జిల్లాలో 15, నిర్మల్ జిల్లాలో 19, సంగారెడ్డి జిల్లాలో 72, వికారాబాద్ జిల్లాలో 18, వనపర్తి జిల్లాలో 37, యాదాద్రి భువనగిరి జిల్లాలో 28, నాగర్‌కర్నూల్ జిల్లాలో 52, మంచిర్యాల జిల్లాలో 53, కరీంనగర్ జిల్లాలో 75, కామారెడ్డి జిల్లాలో 61, భూపాలపల్లి జిల్లాలో 19, జగిత్యాల జిల్లాలో 91, ఆదిలాబాద్ జిల్లాలో 15 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.