ఏపీలో కరోనా అప్డేట్ : 9,901 కేసులు ..మరణాలు కాస్త తగ్గాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో 75,465 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,901 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 5,57,587కు చేరింది. అలాగే కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి మరో 67 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 4,846కు పెరిగింది.

శనివారం 10,292 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 5,57,587 పాజిటివ్ కేసులకు గాను, 4,57,008 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 95,733 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

శనివారం ఇక జిల్లాలవారి చూస్తే..

#COVIDUpdates: 12/09/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,54,692 పాజిటివ్ కేసు లకు గాను
*4,54,113 మంది డిశ్చార్జ్ కాగా
*4,846 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 95,733#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/p2JsgUnK5k— ArogyaAndhra (@ArogyaAndhra) September 12, 2020