Site icon TeluguMirchi.com

ఏపీ కరోనా రిపోర్ట్ : 6,224 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 6,224 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,13,014కి చేరింది.

గడిచిన 24 గంటల్లో 41 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి 5,941 మంది మృతి చెందారు. వివిధ కొవిడ్‌ ఆసుపత్రులు, హోం ఐసోలేషన్‌లో 55, 282 మంది చికిత్స పొందుతుండగా.. 6,51,791 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లావారీగా కేసులు చుస్తే..

అనంతపురం 282, చిత్తూరు 827, తూర్పుగోదావరి 824, గుంటూరు 491, కడప 491, కృష్ణా 392, కర్నూలు 225, నెల్లూరు 558, ప్రకాశం 619, శ్రీకాకుళం 175, విశాఖపట్నం 225, విజయనగరం 225, పశ్చిమ గోదావరి 890 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 99,959కు చేరుకోగా.. చిత్తూరులో అత్యధికంగా 670 మంది కరోనాతో మరణించారు.

Exit mobile version