Site icon TeluguMirchi.com

కర్నూల్ లో కరోనా బీబత్సం సృష్టిస్తుంది…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. నాల్గు రోజుల క్రితం రెండు అంకెల్లో ఉన్న కరోనా పాజిటివ్ ల సంఖ్య..ప్రస్తుతం మూడు వందలకు చేరువ లో ఉంది. ముఖ్యంగా కర్నూల్ లో కరోనా వైరస్ విపరీతంగా ఉంది. ఒక్క రోజులో 52 పాజిటివ్‌ కేసులు నమోదుకావడం సంచలనంగా మారింది.

ఈ 56 పాజిటివ్ కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే ఎక్కవమంది ఉన్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం మొత్తం 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైతే.. అందులో 18 మంది కర్నూలుకు చెందినవారే ఉన్నారు. దీంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు.. లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలను రెడ్, బఫర్ జోన్‌లుగా ప్రకటించారు. ఎవరినీ బయట తిరగనీయకుండా చర్యలు ప్రారంభించారు.

Exit mobile version