Site icon TeluguMirchi.com

కరోనా కు మందు కనిపెట్టారు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కు మందు కనిపెట్టారు ఆస్ట్రేలియాకు చెందిన కొందరు పరిశోధకులు.యాంటి-పారాస్టిక్‌ డ్రగ్‌ ‘ఐవర్‌మెక్టిన్‌’తో కోవిడ్‌-19 ను ఎదుర్కోవచ్చని అంటున్నారు. ఈమేరకు మోనాష్‌ యూనివర్సిటీ బయోమెడిసిన్‌ డిస్కవరీ ఇన్‌స్టిట్యూట్‌ (బీడీఐ), డోహెర్టీ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. హెచ్‌ఐవీ, జికా వైరస్‌, డెంగ్యూ, ఇన్‌ఫ్లూయెంజా వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఐవర్‌మెక్టిన్‌కు బాధితుని శరీరంలో నుంచి కరోనా వైరస్‌ క్రిములను చంపవచ్చారని తెలిపారు.

ఐవర్‌మెక్టిన్‌ అనే ఔషధం ఎఫ్‌డీఏ అనుమతి పొందిన డ్రగ్‌. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న ఔషదం. ఎంతో సురక్షితమైన డ్రగ్‌ కూడా. పలు వైరల్‌ ఫీవర్లపై ఐవర్‌మెక్టిన్‌ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనితో మానవ శరీరంలో సెల్‌ సంస్కృతిలో పెరుగుతున్న కోవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకోవచ్చని మా పరిశోధనలో తేలింది. ఈ మెడిసిన్‌ సింగిల్‌​ డోస్‌ ద్వారా బాధితుని శరీరంలోని వైరల్‌ ఆర్‌ఎన్‌ఏను 48 గంటల్లో తొలగించవచ్చు. అంటే ఒక్క డోస్‌తో 24 గంటల్లో ​మెరుగైన ఫలితాలు వస్తాయి. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టనుంది. కాబట్టి, అందుబాటులో ఉన్న ఈమెడిసిన్‌తో చికిత్స చేస్తే మంచిది’అని వాగ్‌స్టాఫ్‌ అన్నారు.

Exit mobile version