గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు విచ్చలవిడిగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఓపెన్ చేయడం తో ప్రజలు మళ్లీ మునపటి మాదిరి బయట తిరుగుతున్నారు. దీంతో కేసులు ఎక్కువ అవుతున్నాయి. హైదరాబాద్ లో ఈ నాలు రోజుల్లో 486 కేసులు నమోదు అయ్యాయంటే అర్ధం చేసుకోవాలి కరోనా ఉదృతి హైదరాబాద్ లో ఏ రేంజ్ లో ఉందొ. గడిచిన రెండు నెలలతో పోల్చితే ఈ 4 రోజుల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య గ్రేటర్ లో కరోనా తీవ్రతను తెలుపుతోంది. ఏప్రిల్ లో 376, మే నెలలో 876 కేసులు రాగా.. ఈ నెలలో నమోదైన 638తో కలిసి మొత్తం గ్రేటర్ లో కేసులు 2 వేలకు చేరువలో ఉన్నాయి.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం సుమారు 2 వేల పాజిటివ్ కేసులున్నాయి. సిటిజన్స్, మైగ్రెంట్స్‌తో పాటు పోలీసులు, మెడికల్ సిబ్బంది సైతం వైరస్ బారిన పడ్డారు. లాక్ డౌన్ కంటే ముందు పరిమిత ప్రాంతాలే కరోనా హాట్ స్పాట్‌గా ఉండేవి. రిలాక్సేషన్స్, పాజిటివ్ ట్రేసింగ్‌ల్లో ఆలస్యం, ఎలాంటి సింప్టమ్స్ కనిపించకపోవడం లాంటి వాటితోనే స్పీడ్ గా వైరస్ స్ప్రెడ్ అయినట్టు తెలుస్తోంది. ఢిల్లీ మర్కజ్ లింక్‌లతోనే మొదట్లో ఓల్డ్ సిటీ నుంచే ఎక్కువ కేసులు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో కేసులు ట్రేస్ చేస్తుంటే, మిగతా ప్రాంతాల్లో లింక్‌లతో సంబంధం లేకుండా పాజిటివ్ లు వస్తున్నాయి. రిలాక్సేషన్స్ తర్వాత జీహెచ్ఎంసీలోని అన్ని సర్కిళ్లకు స్ప్రెడ్ అయి కేసుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతోంది.