Site icon TeluguMirchi.com

కరోనా తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకొనేందుకు ముందుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం

కరీంనగర్ జిల్లాలో కోవిడ్ తో మృతి చెందిన తల్లితండ్రుల పిల్లలను ఆదుకునే బాధ్యత జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులు చేపట్టారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఎంత మంది పిల్లల తల్లి తండ్రులు కోవిడ్ తో మరణించారు అని వివరాలు సేకరిస్తున్నారు. ఆ పిల్లల ఇంటికి వెళ్లి వారికి మేము అండగా నిలుస్తాము అని భరోసా కల్పిస్తున్నారు. ఈ ఉదయం మానకొండూరు గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లల తల్లి తండ్రులు కరోనాతో మరణించగా ఆ పిల్లలకు మనోదైర్యం కలిపించటానికి అధికారులు వారి ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం వారికి తాత్కాలికంగా 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణి చేశారు. వారిని ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆడుకుంటామని మంచి నాణ్యమైన విద్యను అందిస్తాము అని తెలిపారు.

Exit mobile version