కరోనా వైరస్ పై అవగాహన పెంచుకుని, ప్రభుత్వం సూచించిన నిబంధనలను కట్టుదిట్టంగా పాటించడం ద్వారా ఖమ్మం జిల్లాలోని సింగరేణి మండలం అప్పాయిగూడెం గ్రామంలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కరోనా రహిత గ్రామంగా ఇప్పుడు ఆ గ్రామం అందరి మన్ననలను అందుకుంటున్నది. గ్రామస్తుల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమైందని గ్రామ సర్పంచ్ అరుణ తెలిపారు.