కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన దేశవ్యాప్తంగా కరోనా ఫ్రీ వ్యాక్సిన్ కార్యక్రమం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ రోజునుండి ఫ్రీ వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వమే అందించనుంది. వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి 75 శాతం వ్యాక్సిన్ కేంద్రమే కొనుగోలు చేస్తోంది. ఆ కొనుగోలు చేసిన వ్యాక్సిన్ లను రాష్ట్రాల వారీగా పంపిణీ చేస్తోంది.
ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ లలో కేంద్రం సేకరించగా మిగిలిన 25 శాతం వ్యాక్సిన్ లు ప్రైవేట్ ఆస్పత్రులు కొనుగోలు చేసుకోవచ్చు. టీకాల ఫిక్స్ డ్ రేట్లకు 150 రూపాయల సర్వీస్ ఛార్జీ కలిపి ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సిన్ లు అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో మూడు రకాల కొవిడ్ వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయి. కొవిషీల్డ్ 780, కొవాగ్జిన్ 1,410, స్పుత్నిక్ వి 1,145 రూపాయలకు లభిస్తోంది.