ఒమిక్రాన్ మహమ్మారి దేశంలోకి ప్రవేశంచడమే కాదు కొద్దీ కొద్దీ దాని పంజా విసురుతుంది. ప్రస్తుతం దేశంలో 21 కి కేసుల సంఖ్య పెరగడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. తెలంగాణ సర్కార్ సైతం ముందస్తు జాగ్రత్తలు హెచ్చరిస్తుంది. ఇప్పటికే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని , లేదంటే వెయ్యి ఫైన్ కట్టాల్సి వస్తుందని తెలిపింది.
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు పలు కీలక సూచన చేశారు. జనవరి 15 తర్వాత రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని, ఫిబ్రవరి నాటికి అవి మరింత తీవ్రతరమయ్యే అవకాశాన్ని కొట్టి పడేయలేమని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులందరూ కరోనా టీకా వేయించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించారు. ఇలాంటి స్వీయ జాగ్రత్తలతోనే థర్డ్ వేవ్ నుంచి బయటపడగలమని అన్నారు.
ఒమిక్రాన్ సోకిన వ్యక్తులకు తీవ్ర ఒళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, ఇది ఊరటనిచ్చే అంశమే అయినా అప్రమత్తంగా ఉండాల్సిందేనని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. వైరస్ వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో బాధితులు ఆసుపత్రుల్లో చేరడం, మరణాలు సంభవించడం వంటివి నమోదు కాలేదని తెలిపారు.