కరోనా మహమ్మారి హైదరాబాద్ మాహానగరాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ రెండు వారాల్లో దాదాపు 500 కేసులు నమోదు అయ్యాయంటే కరోనా ఉదృతి ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం కేంద్రం సడలింపులు ఇవ్వడం, ప్రజలు రోడ్ల పైకి రావడం తో కరోనా కేసులు ఇంకాస్త పెరుగుతున్నాయి.
హైదరాబాద్ మహానగరం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ప్రభుత్వం సైతం కరోనా బారిన పడకుండా ప్రజలే జాగ్రత్త గా ఉండాలని చెపుతుండడం తో ప్రజన్లో ఇంకాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరితో మాట్లాడితే ఏమవుతుందో అని భయపడుతున్నారు.