తెలంగాణ రాష్ట్రం లో కరోనా ఉదృతి తీవ్ర స్థాయి లో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో నగర వాసులను వణికిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరగడమే తప్ప తగ్గడం లేదు. సోమవారం కొత్తగా 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత కొద్దిరోజులుగా తెలంగాణాలో 200 పైన కేసులు నమోదు కావడం తెలంగాణా ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది.
ఇక ఈరోజు కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఈ ఒక్క రోజే 189 మందికి కరోనా పాజిటివ్ అని తేలడం కలకలం రేపుతుంది. ఇక సంగా రెడ్డిలో 2, మేడ్చల్లో 2, రంగారెడ్డిలో 13, వరంగల్ అర్బన్ లో 4 కేసులు నమోదయ్యాయి. మిగతా కొన్ని జిల్లాల్లో రెండ్రెండు కేసులు, అలాగే ఒక్కో కేసు చొప్పున గుర్తించారు.