ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత గట్టిగానే ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు వేలసంఖ్య లో కేసులు నమోదు అవుతున్నాయి. దీనిబారిన సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నేతలు సైతం ఎక్కువ సంఖ్యలోనే పడుతున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి కరోనా బారినపడ్డారు. పార్లమెంట్ సమావేశాలకు గాను ఢిల్లీ వెళ్లిన ఈమెను పార్లమెంట్ సిబ్బంది కరోనా పరీక్షలు చేయగా..ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె రెండు వారాలపాటు ఢిల్లీ లోనే చికిత్స తీసుకోనున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. 18 రోజులపాటు సాగే ఈ సభాకార్యకలాపాలు పాలీ కార్బన్ షీట్లతో ఎంపీల మధ్య (భౌతిక) దూరం పెంచాయి. జీరో అవర్ ను కుదించడం, ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడం ఈ సెషన్ లో ముఖ్య విశేషం. రాజ్యసభ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు, లోక్ సభ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటలవరకు కొనసాగనున్నాయి.