Site icon TeluguMirchi.com

ఏపీలో మరో ఎమ్మెల్యే కు కరోనా

కరోనా మహమ్మారి ఎవర్ని వదలడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉదృతి కాస్త తగ్గినప్పటికీ కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు వెలుగులోకి వస్తుండడం తో మళ్లీ అందరిలో భయం మొదలైంది. ఇప్పటికే దేశంలో ఆరు కొత్త కేసులు నమోదు అయినట్లు తేలింది. ఇక ఏపీ విషయానికి వస్తే..తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు.

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.ఈ విషయాన్ని ఎమ్మెల్యే శిల్పారవి తన సోషల్‌ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించారు. ఎమ్మెల్యే శిల్పారవి ఈనెల 25వ తేదీ నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వివిధ ‌ కార్యక్రమాలలో విరివిరిగా పాల్గొన్నారు.తనను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా‌ పరీక్షలు చేయించుకొని, స్వీయ నిర్బందంలో ఉండాలని ఎమ్మెల్యే శిల్పా రవి పిలుపునిచ్చారు. కరోనా కారణంగా ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని,ఎవరు అందోళన ‌చెందాల్సిన అవసరం లేదన్నారు.

Exit mobile version