Site icon TeluguMirchi.com

కరోనా బారిన పడిన రాష్ట్ర బిజెపి అధ్య‌క్షుడు ..

కరోనా మహమ్మారి రాజకీయ నేతలను నిద్ర పోనివ్వకుండా చేస్తుంది. ప్రతి రోజు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు దీనిబారినపడుతున్నారు. తాజాగా రాజ‌స్థాన్ బీజేపీ రాష్ట్ర శాఖ‌ అధ్య‌క్షుడు స‌తీష్ పుణియాకు క‌రోనా సోకింది. తాను క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, ఎలాంటి ల‌క్ష‌ణాలు లేన‌ప్ప‌టికీ పాజిటివ్ వ‌చ్చింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.

డాక్ట‌ర్ల సూచ‌న‌తో తాను హోం ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని చెప్పుకొచ్చారు. అలాగే ఈమ‌ధ్య కాలంలో త‌న‌ను క‌లిసిన‌వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న‌ సూచించారు. త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన‌వారంద‌రికి ధ‌న్య‌వాదాలు అని వెల్ల‌డించారు.

Exit mobile version