కరోనా తో హాస్పటల్ లో చేరిన పురంధేశ్వరి ..

వరుసగా రాజకీయనేతలు కరోనా బారినపడుతున్నారు. నిన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా బారినపడగా..తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి కరోనా బారిన పడ్డారు.

రెండు రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుండటంతో టెస్టులు చేయించుకోగా… కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో హైద్రాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో ఆమె ట్రీట్మెంట్‌ తీసుకుంటున్నారు. ఇటీవలే ఆమెను జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ ప్రకటించింది. ఇదే క్రమంలో నేతలు, కార్యకర్తలు ఆమెకు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ క్రమంలో ఆమెకు కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు.