Site icon TeluguMirchi.com

కరోనా బారినపడిన దేవరకద్ర ఎమ్మెల్యే..

దేశ వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. మొదటితో పోలిస్తే భారీగా కేసులు , మరణాలు తగ్గినప్పటికీ..కరోనా ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక ఈ మహమ్మారి బారిన అనేక మంది సినీ , రాజకీయ నేతలు పడగా..తాజాగా తెరాస పార్టీ ఎమ్మెల్యే కరోనా కు చిక్కాడు.

మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. కరోనా లక్షణాలు కన్పించడంతో తాను పరీక్షలు చేయించుకున్నానని తెలిపారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలిందన్నారు. గత కొద్దిరోజులుగా కలిసిన వారు, సన్నిహితంగా ఉన్నవారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

Exit mobile version