Site icon TeluguMirchi.com

కరోనా బారిన పడిన మాజీ మంత్రి జూపల్లి..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి ఏ స్థాయిలో ఉందొ చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజు వేలసంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ కేసుల్లో రాజకీయనేతల కేసులు కూడా ఉన్నాయి. తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనను కలిసిన నేతలు, కార్యకర్తలంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. మరోపక్క తెలంగాణలో మంగళవారం నాడు 3,018 కొవిడ్‌ కేసులను గుర్తించారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,11,688 కి చేరింది.

Exit mobile version