Site icon TeluguMirchi.com

టీడీపీ నేతకు కరోనా..

ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతుండగా…దీనిబారిన సామాన్య ప్రజలతో పాటు రాజకీయనేతలు పడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు కరోనా సోకగా..తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా పాజిటివ్ తేలింది. ఆయనే స్వయంగా ట్వీట్ చేసి కరోనా విషయం చెప్పారు.

‘నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండమని డాక్టర్ సూచించారు. ఈ 14 రోజులు రాజకీయలకు దూరంగా ఉంటాను. నాకు దైవ సమానులైన మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, అభిమానుల ఆశీస్సులతో కోవిడ్ ని జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటాను’అన్నారు.

Exit mobile version