ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత గట్టిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండగా..దీనిబారిన రాజకీయ నేతలు సైతం పడుతున్నారు. ఇప్పటికే పలువురు అధికార , ప్రతిపక్ష నేతలు దీనిబారిన పడగా..తాజాగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటూ ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి కూడా వైరస్ బారిన పడ్డారు.
ఇద్దరూ తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేరారు. భూమన వారం రోజులుగా కరోనాపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. తనను కలిసిన కార్యకర్తలు టెస్టులు చేయించుకోవాలని.. లక్షణాలున్నవారు హోమ్ ఐసోలేషన్లోనే ఉండాలని సూచించారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు చేస్తున్నారు.