కరోనా బారిన పడిన అచ్చెన్నాయుడు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదు. సామాన్య ప్రజలనే కాక రాజకీయ నేతలను సైతం నిద్ర పోనివ్వడం లేదు. ఇప్పటికే పలువురు అధికార , ప్రతిపక్షనేతలు కరోనా బారినపడగా, తాజాగా టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

ఈఎస్ఐ కేసులో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. నిన్న ఉదయం నుంచి ఆయన జలుబుతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ప్రతివారం అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టుకు ఆసుపత్రి నివేదిక ఇస్తోంది.